Quotes on Education System in Telugu.
అవే నీతి కబుర్లు చెబుతూ
అవినీతి చేస్తుంటారు
సరైన శిక్షణ ఇవ్వరు
క్రమశిక్షణగా ఉండాలంటారు
ఫీజుల వసూళ్లు లక్షల్లో
సదుపాయాలు మృగ్యం
మాటలు మృదువుగా
చేతలు కటువుగా
నిబంధనలు గాలికి
బందీలుగా విద్యార్థులు
భవనాలకు తెల్లని సున్నం
తల్లి తండ్రులకు
వొళ్ళంతా సున్నం వేస్తారు
ఫీజులకై రోజంతా మెసేజ్లు
పిల్లవాని బాగోగులు చెప్పని మేధావులు
అయ్యో హతవిధీ,
నిధులన్నీ మింగి నదిలో తోసే
ప్రయివేటు విద్యాసంస్థలు
అవే నీతి కబుర్లు
చేసేవి అవినీతి జోకులు
.
.
.
.
బిరుదు గంటి శ్రీనివాసరావు (Dr. B.srinivasarao)(Kakinada)…