Telugu Valentines Day Quotes and Wishes in Telugu
Read More Telugu Valentines Day Quotes and Wishes >
శీతాకాలం వేకువజాము పొగమంచు అడుగుతోంది…
ఎక్కడ నీ ప్రియుడు అని??
పొగమంచుకు ఎలా చెప్పగలను,
తను నా హృదయంలో కొలువై ఉన్న సంగతి!!
పెరట్లో విరబూసిన మందారం నవ్వుతూ అంటోంది..
నాలా అయినా పలకరించాడా నీ చెలికాడు అని??
మందిరానికి ఎలా తెలుపగలను,
నా పెదవులపై ఉన్న నవ్వు తనదే అని!!
సముద్రపు అలలు నా పాదలని చేరి ఆడుకుంటూ పరిహసిస్తున్నాయి..
కలలో అయినా కనిపించాడా నీ కలల రాకుమారుడు అని??
అలలకు ఎలా చూపగలను,
అతని ఊహలు వరదలా నన్ను ముంచెత్తుతున్నాయని!!
అమవాస్యరాత్రి మినుకుమంటున్న తార అడుగుతోంది..
నీ ప్రియుని జాడ ఎటు వైపు అని??
తారకి ఎలా చూపగలను,
అతని తలపులు వెన్నెలలా నన్ను ఎలా తడుముతున్నాయో!!
నేనే తను, తనే నేను అయినపుడు,
ఎక్కడ ఉంటేనేం నాతో ఉన్నట్టు కాదా??
ఏ రోజయితే నేం రోజూ ప్రేమికులరోజు కాదా??
Telugu Valentines Day Quotes and Wishes in English.
Sheetakalam vekuvajaamu pogamanchu adugutondi,
Ekkada nee priyudu ani ?
Pogamanchuku elaa cheppanu,
Tanu naa hrudayamlo koluvai unna sangati.
Peratlo verboosina mandaaram navvutu antondi,
Naalaa ayinaa palakarinchadaa nee chelikaadu ani.
Mandaaraniki elaa telupagalanu,
Naa pedavulapai unna navvu tanade ani.
Samudrapu alalu naa paadaalani cheri adukuntoo parihasistunnayi,
Kalalo ayinaa kanipinchadaa nee kalala raakumaarudu ani.
Alalaku elaa chupagalanu,
Atani oohalu varadalaa nannu munchettutunnayani.
Amavaasya ratri minukumantunna taara adugutondi,
Nee priyudu jaada etuvaipu ani ?
Taaraki elaa chupagalanu,
Atani talapulu vennelalaa nannu elaa tadumutunnayo!
Nene tanu, tane nenu ayinappudu,
Ekkada untenem, naatho unnattu kaadaa !!
Ee rojayitenem, roju premikularoju kaadaa ?
.
.
.
.
నీలిమ (Neelima) (Warangal) …