మద్యపానం | Alcohol Awareness Week quotes

0
312

Alcohol Awareness Week quotes in Telugu. 

 
మతులను పోగొట్టే పానీయం

మత్తులో ముంచేసే ద్రావణం
లోకమంతా దానికి దాసోహం
వ్యసనం లా మారే మద్యపానం !
వీది వీదిన తెరుచుకొన్న బారులు
పడిగాపులు కాసే మందుబాబులు
రుచి చూడమనే రమ్ములు,బీరులు
మందు కోసం కరిగి పోవును కాసులు !
పగలు అని లేదు రాత్రి అని లేదు
సుఖమని లేదు బాధ అని లేదు
గరీబు అని లేదు నవాబు అని లేదు
మందు మాయలో మునగక తప్పదు !
మందు తాగినాక ఎక్కును హ్యాంగోవరు
ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఎత్తును చీపురు
తాగి తాగి వాచి పోవును లివరు
నీ చిత్రపటం కు పెట్టెదరు ఫ్లవరు !
మందు వదిలి ముందుకు సాగు మిత్రమా
చిత్తైన జీవితాలను బాగు చేసుకో నేస్తమా
అందమైన బంధాలను కాపాడుకో మిత్రమా
మద్యపాన మహమ్మారి ని పారదోలు నేస్తమా !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here