Jeevitam telugu kavitalu
ఓ బంధమా,
తల్లి ప్రేమతో మొదలై ప్రాణం పోసుకున్న నీ పయనం…..
తండ్రి ఆప్యాయత, తోబుట్టువుల మమకారం,
స్నేహితుల అభిమానంతో చిగురిస్తూ …
భర్త అనురాగం, అత్తమామల ఆదరం తోడై మొగ్గలు తొడిగి….
పిల్లల ఆలనా పాలనతో వికసించిన వేళ….
మేమున్నాము అంటూ, అసూయ, స్వార్థం , ద్వేషం పరకాయ ప్రవేశం చేసిన వేళ….
అమ్మ , నాన్న , తోబుట్టువు బంధాలన్నిటిని బంధీ చేసి….
జీవిత పరమార్ధం మరచి….
బంధాలన్నీ భ్రమా అనేంతలో ….
దైవత్వం ఊపిరి పోసుకున్న వేళ,
ఆహా… మనిషి జన్మ యెంత మధురం అని తలపించి మురిపించి…
ముందుకు సాగిపోతున్న బంధమా…..
నీకు జోహారు……
.
.
.
.
Sree Paligaram…