ప్రకృతిని మరిచిన e-మర మనిషి | Telugu Artificial Life Quotes

1
95
Telugu Artificial Life Quotes
Telugu Artificial Life Quotes

Telugu Artificial Life Quotes in Telugu.

ఉషోదయ వేళలో గడ్డిపోచలపై కురిసిన హిమబిందువులు,
ప్రాతకాలంలో పలకరించే పక్షుల కూయగానాలు,
కడలి అలల నడుమ ప్రకాశించే కడిగిన స్వాతి ముత్యాలు,
కొండల చాటున ఉదయించే సూర్యకిరణాలు,
పూలతోటలో పూజల కొరకు పుష్పించే రంగు రంగుల పుష్పాలు,
సూర్యోదయ వేళ  ఇంటివాకిట అమ్మాయిలు వేసే రంగవల్లులు,
పౌర్ణమి నాటి జాబిల్లి కురిసే సువర్ణ కాంతులు,
సాయం సమయాన సెలయేరుల సవ్వడులు,
నిశీధి రాత్రి వేళలో నింగి నీడలో విడిది చేసిన నక్షత్ర వలయాలు,
ఇవే ప్రకృతి ప్రసాదించిన ప్రేమకు ప్రతిరూపాలు,
కాని వీటిని వీక్షించే మనుషులు గాని, ఆశ్వాదించే మనసులు గాని,
ఈ మ(ని)నవ లోకంలో, అభినవ సమాజంలో చూడలేము,
ఎందుకంటే e-మర మనిషి జీవితాన్ని, జీతంతో ముడిపెట్టి పరుగులు పెడుతున్నాడు కనుక..

Telugu Artificial Life Quotes

Telugu Artificial Life Quotes in English.

Ushodayapu velalo gaddipochalapai kurisina himabinduvulu,
Praatakaalamlo palakarinche pakshula kooyagaanaalu,
Kadali alala naduma prakashinche kadigina swathimutyalu,
Kondala chatuna udayinche suryakiranaalu,
Poolathotalo pujala koraku pushpinche rangurangula pushpalu,
Suryodaya vela intivaakita ammayilu vese rangavallulu,
Pournami naati jabilli kurise suvarna kantulu,
Saayam samayana selayerula savvadulu,
Nishidi ratri velalo ningi needalo vididi chesina nakshatra valayaalu,
Ive prakruti prasadinchina premaku pratiroopalu.
Kani veetini veekshinche manushulu gani, aashwadinche manasulu gani,
Ee ma(ni)nava lokamlo, abhinava samaajamlo chudalemu,
Endukante e-mana manashi jeevitanni, jeetamtho mudipetti parugulu pedutunnadu kanuka…
.
.
.
.
(సంధ్య) డా. శ్రీనివాసరావు కాశిసోమయాజుల (Dr. Srinivasa Rao Kasisomayajula)…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here