Men And Women Quotes in Telugu.
ఆడ – మగ…???
భగవంతుని సృష్టిచే జన్మించిన రెండే రెండు జాతులు
ఆడ – మగ ,
మరి వీరి గురించి, వీరి బాధ్యత గురించి ఒక్క వాక్యంలో చెప్పుకుంటే,
“ఆడవాళ్ళ వయస్సు ,మగవాడి సంపాదన ఎప్పుడు అడగకూడదు,
ఆడవారు తమకోసం బ్రతకరు, అదే మగవారు తమకోసం సంపాదించరు”.
ఆడవారు ఎప్పుడూ కూడా వారికోసం గడపరు ,
వారి జీవితం అంతా ఒకరి కోసమే అంకితమై పోతుంది,
చిన్నప్పుడు అక్క – చెల్లిగా – పెరిగి పెద్దయ్యాక భార్యగా, ఆ తరువాత తల్లిగా…
తమ జీవితం అంతా ఇతరుల కోసమే అంకితమై పోతుంది కనుక,
వారు ఎంత ఎక్కువ కాలం బ్రతికితే అంత కాలం ఇతరులకు ఆదరణ దొరుకుతుంది,
తమ కోసం కాక ఇతరులకోసమే తమ వయస్సుని అంతా ధారపోసి,
తమ వయస్సు ఎంతోకూడా మరచిపోయి ఇతరుల కోసం బ్రతికే ఆడవారి వయస్సు అడగడం భావ్యమా?
అదే మగవారి సంపాదనకూడా ఎప్పుడూ అడగరాదు ,
మగవారు ఎప్పుడూ వారికోసం సంపాదించుకోరు ,
సంపాదించిన దానిలో తమకోసం ఒక్క రూపాయి ఖర్చు చెయ్యరు,
ఆ రూపాయిలో చెల్లెలు నవ్వు, అక్క కోరిక, కొడుకు భవిష్యత్తులు చూస్తూ,
ఇలా తనవారి అవసరాలు అన్ని ఆ రూపాయిలో చూస్తూ చూస్తూ,
తనకు అవసరాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మర్చిపోతాడు,
అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, తండ్రిగా ప్రతి పాత్రలో కుటుంబ పోషణ కోసం,
అహర్నిశలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి కుటుంబ సంతోషాన్ని ఖరీదు చేస్తాడు పైసాతో,
మగవాడు తాను తిన్నా తినకపోయినా కుటుంబాన్ని మాత్రం పస్తులు పెట్టడు,
తనవారి ఆకలితీర్చడంలో పడి తన ఆకలి మరచిపోతాడు,
తన కోసం అక్కరకు రాని సంపాదనను తనని అడగడం ఔచిత్యమా?
.
.
.
.
శ్రీనివాసరావు సూరిశెట్టి (Dr. Srinivasa Rao Surisetty)(Nellore)…
ఆడ, మగ ఇద్దరి బలాలు తెలియచేస్తూ చక్కని తర్కంతో కూడిన కవిత