Labour day quotes for May Day in Telugu
🌴🌴కార్మికులారా…
కరాలనే ఆయుధాలుగా చేసి,
నరాల బిగువును శక్తిగా మలిచి,
రెక్కలనే ముక్కలుగా చేసి,
మానవాళి అకలిని తీర్చి,
ప్రపంచ సౌభాగ్యాన్ని పెంచి,
సకల సౌఖ్యాలకు సాక్ష్యముగా నిలిచిన
ఓ కార్మికుడా వందనం..
కార్మికుడిది ఒకటే కులం,
కులం అంటే కాదు వర్గం,
జీవనానికి అదొక మార్గం,
ఎన్నో వృత్తుల సమ్మేళనం,
అందరి మనుషుల పోషణం,
మంనదరి మనసుల మోదం,
శ్రామికుడికి తెలిసిన కులం..
మనుషుల మలినం తొలిగించే
చాకిరేవుబండ,
వెలుగునిచ్చే సూర్యరథచక్రం
కుమ్మరి చక్రం,
భూమి కడుపుని చీల్చి,
మన కడుపుని నింపే
రైతు నాగలి,
మూటలు మోసేవాడు,
మాటలు చెప్పేవాడు,
కోతలు కోసేవాడు,
కట్టెలు కొట్టేవాడు,
కంసాలి, కూలి,
కళాకారులు,కాపాలాదారు,
కష్టపడే ప్రతిఒక్కరు,
సృష్టికి రూపం వారు,
లోక కల్యాణానికి కర్తలువారు..
దోపీడీకి గురైన కష్టం,
అలమటించిన శ్రామిక వర్గం,
ఆవేశాన కార్మిక లోకం
తిరగబడిన సమాజం,
కష్టానికి ప్రతిఫలం,
కార్మికుల దినోత్సవం,
పేదోడి హర్షాతిరేకం….
🌹కష్టజీవుల చరణాలకు
కరాల అభివందనం🌹
🌴🌴ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు🌴🌴
.
.
.
.
Venky K (Nellore)