అలల ఘోష | Telugu Quotes about Life and Sea

0
105
Telugu Quotes about Life and Sea

Telugu Quotes about Life and Sea in Telugu.

అలలు ఎగసి – ఎగసి పడుతున్నాయి,
కలలు నెరవేరకుండా చేసే కష్టాలవి.

సముద్రం మధ్యలో విశ్వంభరుడు శయనిస్తూ,
సమూహమైన వెతాలలు (వెత+అలలు) పంపుతున్నాడు.

తలవంచుకుని నేను అసాధ్యుడిని అనుకుంటే,
తల త్రెంచేటువంటి మారణాయుధాలు అలలు.

తిమిరమో అటు తామర వనమో తెలియదు,
తిమింగలాల తిరునాళ్ళలో ఈత తప్పదు.

సంసార సాగరంలో అడుగంటిన ముత్యాలెన్నో,
సంసారిక మంత్రాలతో బయటకు తీయగలమా.

యమపాశం వంటి సముద్రాన్ని దాటి ఒడ్డుకెల్తే,
సుమపాశం వలె మెడలోని శోభిల్లుతుంది.

అలల ఘోషా? లేక నరక ఘోషా? ఏమో!
అలా అనుకుంటే అది అమృత ఘోషౌ.

తలకెక్కిన మదాన్ని కాళ్ళడుగున అణచి,
ఫలమాశించక నేను కడలిని ఈదుతాను.

కవితా శంఖాన్ని పూరించుతున్నాను,
కవితానందమై నాతో వచ్చేది ఎవరు…?

Telugu Quotes about Life and Sea

Telugu Quotes about Life and Sea in English.

Alalu egasi – egasi padutunnaayi,
Kalalu neravaerakundaa chaesae kashtaalavi.

Samudram madhyalo visvambharudu Sayanistoo,
Samoohamaina vetaalalu (veta+alalu) pamputunnaadu.

Talavanchukuni nenu asaadhyudini anukunte,
Tala trenchaetuvanti maaranaayudhaalu alalu.

Timiramo atu taamara vanamo teliyadu,
Timingalaala tirunaallalo eeta tappadu.

Samsaara saagaramlo adugantina mutyaalenno,
Samsaarika mantraalato bayataku teeyagalamaa.

Yamapaasam vanti samudraanni daati oddukelte,
Sumapaasam vale medaloni sobhillutundi.

Alala ghoshaa? Laeka naraka ghoshaa? Aemo!
Alaa anukunte adi amruta ghoshau.

Talakekkina madaanni kaalladuguna anachi,
Phalamaasinchaka nenu kadalini eedutaanu.

Kavitaa sankhaanni poorimchutunnaanu,
Kavitaanandamai naato vachchaedi evaru…?
.
.
.
.
Raghava (Srikakulam)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here