Home Kavithalu on Life అసంతృప్తి | Telugu Quotes about Dissatisfaction

అసంతృప్తి | Telugu Quotes about Dissatisfaction

0
111
Telugu Quotes about Dissatisfaction

Telugu Quotes about Dissatisfaction in Telugu.

హృదయ ద్వారాలు తెరచి,
అక్కడే ఆసనమేర్పరచుకొని
గుండెకు కాపలా కాసేది
గుది బండలా తయారయ్యేది

అనుక్షణం అనవసర వాంఛలను ప్రేరేపించేది ,
అసాధ్యాల కోసం యత్నాలు గావింపజేసి
మనః తాపం కలిగించేది,
లేని అలజడిని మనసులో రేకెత్తించి
అల్లకల్లోలం సృష్టించేది,

సాగరం లో కల్లోలం రేపి నిరాటంకంగా సాగే నౌకకు
కంటకంగా జనించి,
తప్పుడు మార్గానికి తరలించే తుఫాన్ లాంటిది

అదే బాగుకు వినాశ హేతువు
అదే మానిషి నావహించిన
అవ్యక్త అశాంతి బిందువు

Telugu Quotes about Dissatisfaction

Telugu Quotes about Dissatisfaction in English.

Hrudaya dwaraalu terachi,
Akkade aasanamerparachukoni
Gundeku kapalaa kasedi
Gudi bandalaa tayarayyedi

Anukshanam anavasara vaanchalanu prerepinchedi
Asaadhyaala kosam yatnaalu gaavimpajesi
Manahtaapam kaligincedi,
Leni alajadini manasulo rekettinchi
Allakallolam srushtinchedi,

Saagaramlo kallolam repi niratamkamgaa sage noukaku kantakamgaa janinchi,
Tappudu marganiki taralinche tufan lantidi

Ade baguku vinasha hetuvu,
Ade manishinavahinchi avyakta ashanti binduvu…
.
.
.
.
డా. గంగాధర్ అక్కినపల్లి (Gangadhar Akkinapalli)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here