Prema Parichayam Telugu Kavithalu in Telugu in Telugu.
నిన్ను కలిసిన క్షణానే తెలిసింది,
నా ఇన్నాళ్ళ అన్వేషణకు బదులు నీవేనని…
నీ రూపు కళ్ళ నిండుగా చేరిన క్షణాన తెలిసింది,
నా ప్రతి ఊహకు ప్రాణం పోస్తే నీ మోము వలే ఉంటుందని…
నీ పరిచయం తరువాతనే తెలిసింది,
స్నేహం తీరం నేను అయితే,
అమాయకత్వం అనే అలల తాకిడికి,
మదిలో పులకరింపులు రేపింది నీవేనని…
నీ నోటి వెంట నా పేరు పలికిన క్షణాన తెలిసింది,
నా పేరు లో ఉన్న ప్రతి అక్షరం యొక్క ప్రత్యేకత ఏమిటని…
నీ వెంట కలిసి అడుగులు వేసిన క్షణానే తెలిసింది,
నా తుది శ్వాస విడిచే వరకు తలపు తెలియని పయనం నీతోనని…

Prema Parichayam Telugu Kavithalu in English.
Ninnu kalisina kshanane telisindi,
Naa innalla anveshanaku badulu neevenani…
Nee rupu kalla nindugaa cherina kshanaana telisindi,
Naa prati uhaku pranam poste nee momu vale untundani…
Nee parichayam taruvatane telisindi,
Sneham teeram nenu ayithe,
Amayakatvam ane alala takidiki,
Madilo pulakarimpulu repindi neevenani…
Nee noti venta naa peru palikina kshanaana telisindi,
Naa perulo unna prati aksharam yokka pratyekata emaitani…
Nee venta kalisi adugulu vesina kshanane telisindi,
Naa tudi swasha vidiche varaku talapu teliyani payanam neethonani…
.
.
.
.
Bhavani Challa (Macherla)…