Amaram Amma Prema Kavithalu in Telugu.
నన్ను విడిచి శూన్యంలో కలిసి పోయావు అనుకుంటే,
తెల్లవారుజామున మంచు దుప్పటిని తొలగించి,
ఆకాశానికి తిలకముగా మారి,
నీ వెచ్చని శ్వాసను కిరణాలుగా మార్చి,
నన్ను నిద్ర లేపటానికి వచ్చావా అమ్మ…
నాకు దూరమై నన్ను చీకటిలో ఒంటరి చేసావ్ అనుకుంటే,
నీ ప్రేమను వెన్నెలగా మార్చి,
చల్లగాలితో నాకు జోల పాడి,
నిద్ర పుచ్చుతున్నావా అమ్మ…
వేకువన సూర్యుడు నీవే,
రాత్రివేళ చంద్రుడు నీవే అవుతూ,
నన్ను కాపాడుతున్నావా అమ్మ…

Amaram Amma Prema Kavithalu in English.
Nannu vidichi shunyalo kalici poyavu anukunte,
Tellavarujamuna manchu duppatini tolaginchi,
Aakashaniki tilakamugaa maari,
Nee vechani swashanu kiranaalugaa marchi,
Nannu nidra lepataniki vachavaa amma …
Naaku duramai ninnu chikatalo ontarini chesav anukunte,
Nee premanu vennelagaa marchi,
Chalaagaalitho naaku jola paadi,
Nidra puchutunnavaa amma…
Vekuvana suryudu neeve,
Ratrivela chandrudu neeve avutoo,
Nannu kapadugunnavaa amma …
.
.
.
.
Navya Reddy (Nellore)…