Telugu Sad Mood Kavithalu in Telugu.
నువ్వెదురుగా ఉన్నపుడు,
నీ కళ్ళలోకి చూడలేక సిగ్గుతో క్రిందికి వాలిపోయే నా కళ్ళు…
నువ్వు కనుమరుగవ్వగానే ,
జలజలా కన్నీళ్ళని కురిపించేసి,
హృదయాన్ని తడిపేసి,
నా మదిని మరిన్ని జ్ఞాపకాలతో నింపేసి,
గుండెని మరింత బరువెక్కించి,
ఘనీభవించిన భావాలని సైతం తట్టి లేపితే…!
సరే అనుకుని..
ఆ భావాలని అక్షరాలుగా మార్చి,
కవితలల్లుదామని కాగితం కలం పుచ్చుకుంటే..
ఎంతకీ చేయి కదలదే..
ఎలానో కష్టపడి నాలుగు పదాలు అందంగా పరిచాను…
ఇంతలో అక్షరాలు మసకబారాయి,
ఏంటా అని చూస్తే కన్నీటి వర్షం,
ఇక కవితల ఆలోచనని పక్కన పెట్టి,
నీ జ్ఞాపకాలని ఆస్వాదిస్తూ,
కన్నీటితో సావాసం చేస్తున్నా.
నువ్వు తిరిగి వచ్చేవరకూ…

Telugu Sad Mood Kavithalu in English.
Nuvvedurugaa unnappudu,
Nee kallaloki chudaleka siggutho krindaki valipoye naa kallu,
Nuvvu kanuvarugavvagaane,
Jalajalaa kanneellani kuripinchesi,
Hrudayanni tadipesi,
Naa madini marinni gnapakalatho nimpesi,
Ghanibhanichina bhavalani saitam tatti lepithe…!
Sare anukuni…
Aa bhavalani aksharaalugaa marchi,
Kavitalalludaamani kaagitam kalam puchukunte…
Entake cheyi kadalade..
Elano kashtapadi nalugu padaalu andangaa parichanu…
Inthalo aksharlu masakabarayi,
Entaa ani chuste kanneeti varsham,
Ika kavitala alochanani pakkana petti,
nee gnapakaalani aswaasistoo,
Kanneetitho saavasam chestunna.
Nuvvu tirigi vachevaraku…
.
.
.
.
Neelima (Warangal)…