ఎలా వెళ్లిపోయావు ప్రియా ? | Yedabatu Kavithalu

0
148
Yedabatu Kavithalu
Yedabatu Kavithalu

Yedabatu Kavithalu in Telugu.

నన్ను వదిలి ఎలా వెళ్లిపోయావు ప్రియా??

ఆ క్షణంలో నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని,
నా కళ్ళలో కదలాడిన భయం కనిపించలేదా??

ఆ క్షణంలో నీ ఎడబాటు భరించే శక్తి లేక,
చిన్నబోయిన నా ముఖం కనిపించలేదా??

నువ్వు నను వీడి వెళ్తున్నపుడు,
ముల్లు గుచ్చుకున్నట్టు బాధ పడ్డ,
నా మనసు కనిపించలేదా??
ప్రాణం పోతున్నట్టు తల్లడిల్లిన,
నా హృదయం కనిపించలేదా??

అయినా, ఎలా వదిలి వెళ్లగలిగావు ప్రియా…
నీకు బాధగా లేదూ??

ఓ.. అర్ధం అయిందిలే..
నీ మనసు నా దగ్గరే వదిలి వెళ్ళావు కదా..
నీ బాధ కూడా నన్నే పడమని..
రెండు మనసుల బరువు మోయలేక
గుండె తడబడుతుంది
ఏ క్షణం ఆగిపోతానో అన్నట్టు….

Yedabatu Kavithalu
Yedabatu Kavithalu

Yedabatu Kavithalu in English.

Nannu vadli elaa vellipoyuaavu priyaa ?

Aa kshanamlo ninnu malli eppudu chustaanu ani,
Naa kallalo kadalaadina bhayam kanipinchaledaa ?

Aa kshanamlo nee Yedabaatu bharinche shakti leka,
Chinnaboyina naa mukham kanipinchaledaa ?

Nuvvu nannu veedi veltunnappudu,
Mullu guchukunnattu baadhapadda,
Naa manasu kanipinchaledaa ?
Praanam potunnattu talladillina,
Naa hrudayam kanipoinchaledaa ?

Ayinaa, elaa vadila vallegaligaavu priyaa ?
Neeku baadhangaa ledoo !

Oo… artham ayindile,
Nee manasu naa dggare vadili vellavu kadaa…
Nee bahda kudaa nanne padamani…
Rendu manasula baruvu moyaleka, gunde tadabadutundi
Ae kshanam aagipotaano annattu…
.
.
.
.
నీలిమ (Neelima)(Warangal)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here