ప్రసూతి విభాగం | Quotes about Obstetrics Department

2
252
Quotes about Obstetrics Department
Quotes about Obstetrics Department

Quotes about Obstetrics Department in Telugu.

వేదనతో వచ్చే ప్రతి తల్లికి,
ఆవేదన పడే ప్రతి మాతృ హృదయానికి,
ఒక చిన్న ప్రాణాన్ని జత పరిచి,
కొత్త ప్రేమను పరిచయం చేసే,
అందమైన కుటీరమే మన ప్రసూతి విభాగం !

రక్తహీనత, రక్తపోటుతో తల్లి ఇబ్బంది పడుతున్నా,
కడుపులో బిడ్డ అడ్డం తిరిగినా,
దగ్గరలో ఉన్న అన్ని ఆసుపత్రులు ధైర్యం చేయకున్నా,
చుట్టూ చీకట్లు మనసులో నిరాశ అలుముకొంటున్నా,
నేనున్నాను అని అక్కున చేర్చుకునే ఆశ్రమమే మన ప్రసూతి విభాగం !

Quotes about Obstetrics Department

ధనిక పేద అనే తారతమ్యం చూడకుండా,
కులం మతం అనే భావాలకు తావు లేకుండా,
పగలు రాత్రి అనే సమయంతో సంబంధం లేకుండా,
ఎల్లవేళలా అందరికీ సమ వైద్యం అందించే ఆలయమే మన ప్రసూతి విభాగం !

కన్న వారిని కట్టుకున్న వారిని వదిలి,
ఉన్న ఊరిని అనుబంధాలను వదిలి,
నిద్రాహారాలు మాని నిరంతరం సేవను ధ్యేయంగా తలిచి,
ప్రాణ ప్రదాతలుగా నిలుస్తున్న,
వైద్య సిబ్బంది కొలువున్న దేవలోకమే మన ప్రసూతి విభాగం !

Quotes about Obstetrics Department Telugu
Quotes about Obstetrics Department Telugu

Quotes about Obstetrics Department in English.

Vedanatho vache prati talliki,
Avedana pade prati matru hrudayaaniki,
Oka chinna prannanni jataparichi,
Kotta pramanu parichayam chese,
Andamiana kutirame mana prasuti vibhagam…

Raktaheenata, raktapotutho talli ibbandi padutunna,
Kadupulo bidda addam tiriginaa,
Daggaralo unna anni aasupatrulu dhairyam cheyakunna,
Chuttu cheekatlu manasulo niraasha alumukontunna,
Nennunnanu ani akkuna cherchukune aashramame mana prasuti vibhagam…

Dhanika peda ane taaratamyam chudakundaa,
Kulam, matam ane bhavalaku taavu lekundaa,
Pagalu ratri ane samayamtho sambandham lekundaa,
Yellavelalaa andariki sama vaidyam andinche aalayame mana prasuti vibhagam…

Kanna vaarini, kattukunna vaarini vadili,
Unna oorini anubandhaalanu vadili,
Nidraahaaraalu maani nirantaram sevanu dhyeyangaa talachi,
Prana pradaatalugaa nilustunna,
Vaidya sibbandi kuluvunna devalokame mana prasuti vibhagam…
.
.
.
.
Dr. Purushotham…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here