Telugu Quotes on Sunday in Telugu.
నిరీక్షించే కన్నులలో వెన్నెల కురిపించడానికి,
అలసిన మనసుల సేద తీర్చడానికి,
పరుగులెత్తె మనుషులకు విరామం ఇవ్వడానికి,
కొత్త ఆశలను మోసుకు వచ్చెను ఆదివారం !
శారీరక శ్రమ చేసే కార్మికులకు,
మానసిక శ్రమ చేసే ఉద్యోగులకు,
ఒత్తిడి తో సతమతమయ్యే విద్యార్థులకు,
ప్రశాంతత తీసుకు వచ్చెను ఆదివారం !
మదిని బాధించే కష్టాలను మరవడానికి,
దూరం అయిన బంధాలను కలపడానికి,
మధుర స్మృతులను గుర్తు చేయడానికి,
శుభ కుసుమాలతో వచ్చెను ఆదివారం !
ప్రకృతి అందాలను పరిచయం చేయడానికి,
జాలువారే జలపాతాల సవ్వళ్ళ ను వినిపించడానికి,
రణ గొణ ధ్వనుల నుంచి విముక్తి కలిగించడానికి,
ఆనందపు జల్లుల మేఘాలతో వచ్చెను ఆదివారం !!

Telugu Quotes on Sunday in English.
Nireekshinche kannulalo vennela kuripinchadaaniki,
Alasina manasula seda teerchadaaniki,
Parugulette maunushulaku viraamam ivvadaaniki,
Kotta aashalanu mosuku vachenu aadivaaram…
Shaareeraka shrama chese kaarmikulaku,
Maanasika shrama chese udyogulaku,
Ottiditho satamatamayye vidhyarthulaku,
Prashantata teesukuvachenu aadivaram…
Madini baadhinche kashtaalanu maravadaaniki,
Duram ayina bandhaalanu kalapadaaniki,
Madhura smrutulanu gurtu cheyadaaniki,
Subha kusumaalatho vachenu aadivaram…
Prakruti andaalanu parichayam cheyadaaniki,
Jaaluvaare jalapaataala savvallanu vinipinchaadiniki,
Rana gana dhvanula nunchi vimukti kaliginchadaniki,
Aanandapu jallula meghaalatho vachenu aadaviram…
.
.
.
.
Dr. Purushotham…