Telugu Friendship Day Kavithalu in Telugu.
ఎవరి పేరు స్మరిస్తే…
ముఖం చంద్రబింబం కన్నా ప్రకాశంగా మారుతుందో,
కన్నులలో కోటి దీపాల కాంతి జనిస్తుందో,
పెదవుల్లో చిరునవ్వు జలపాతంలా సాగుతుందో,
మదిలో ఆనందం వెన్నెలలా వెల్లివిరుస్తుందో,
యదలో లయబద్ధమైన మధుర సంగీతం జనిస్తుందో,
అతనే నా స్నేహితుడు !

ఎవరు నా పక్కన ఉంటే…
కాలం మంచులా కరిగిపోతుందో,
కష్టం దరి చేరకుండా పారిపోతుందో,
ఓటమి అనే మాట వినపడకుండా ఉంటుందో,
ధైర్యం గుండె నిండా ఉప్పొంగుతుందో,
కనే కలలన్నీ నిజం అవ్వుతాయో,
అతనే నా స్నేహితుడు !!

Telugu Friendship Day Kavithalu in English.
Evari peru smariste…
Mukham chandrabimbam kanna prakashangaa marutundo,
Kannulalo koti deepaala kanti janistundo,
Pedavullo chirunavvu jalapaatamlaa sagutundo,
Madilo aanandam vennelalaa vellivirustundo,
Yadalo layabaddamaina madhura sangeetam janistundo,
Atane naa snehithudu…
Evaru naa pakkana unte…
Kaalam manchulaa karigipotundo,
Kashtam dari cherakundaa paaripotundo,
Otami ane maata vinapadakundaa untundo,
Dhairyam gunde nindaa uppongutudo,
Kane kalalannee nijam avutaayo,
Atane naa snehithudu…
.
.
.
.
Dr. Purushotham…