మధుర జ్ఞాపకాల వాహిని బాల్యం | Childhood Memories Kavithalu

2
30
Childhood Memories Kavithalu-2
Childhood Memories Kavithalu-2

Childhood Memories Kavithalu in Telugu.

మొదటి సారి తాడుతోటి బొంగరాన్ని తిప్పినప్పుడు,
మునగ విడచి చెరువులోన ఈత కొట్టినప్పుడు,
సైకిలెక్కి చేతులిడిచి తొక్కినప్పుడు,
తాటిబండి సక్కనంగ సాలులోన తోలినప్పుడు,
బాల్యమా! నీ సంబరానికి అడ్డు అంబరమా!

Childhood Memories Kavithalu-1

మొదటి సారి చెట్టు ఎక్కి కాయ కోసినప్పుడు,
జతగాని గోళీల జేబు ఖాళీ చేసినప్పుడు,
ఉసిరి కాయలు అక్క కోసం పోగేసినప్పుడు,
మొదటి పడవ మునగకుండ వాగులోన సాగినప్పుడు,
బాల్యమా! బంగారు రాశులు నీకు సమతుల్యమా!

పచ్చని పైరు మధ్య చద్దులిప్పినప్పుడు,
నాన్న తెచ్చిన తేనె తుట్టె జుర్రినప్పుడు,
తాత చెప్పిన కథలో రాజు గెలిచినప్పుడు,
కొండపైన బండమీద వర్షంలో తడిచినప్పుడు,
బాల్యమా! నీ జ్ఞాపకాల మాధుర్యానికి తేనె తీపి సరితూగునా?!

Childhood Memories Kavithalu-3

Childhood Memories Kavithalu in English.

Modatisaari Taduthoti bongaranni tippinappudu,
Munaga vidichi cheruvulo eeta kottinappudu,
Cycle ekki chetulidichi tokkinappudu,
Tatibandi sakkananga saalulona tolinappudu,
Balyamaa ! Nee sambaraaniki addu ambaramaa !

Modatisaari chettu ekki kaaya kosinappudu,
Jatagaani golila jevu khali chesinappudu,
Usiri kaayalu akka kosam pogesinappudu,
Modati padava munagakunda vaagulona saaginappudu,
Balyamaa ! Bangaru raashulu neeku samatulyamaa !

Pachani pairu madhya chaddulippinappudu,
Nanna techina tene tutte jurrinappudu,
Tata cheppina kathalo raaju gelichinappudu,
Kondapaina bandameeda varshamlo tadichinappudu,
Balyamaa ! Nee gnapakaala maaduryaniki tene teepi saritoogunaa ?!
.
.
.
.
Kodamala Manohar…

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here