బాల్యం ఒక మధుర జ్ఞాపకం | Best Childhood Memories Kavithalu

4
33
Best Childhood Memories Kavithalu-2

Best Childhood Memories Kavithalu in Telugu.

అమ్మ చేతి గోరుముద్దలు,
బామ్మ చెప్పే చందమామ కథలు,
స్నేహితులతో ఆట పాటలు,
సోదరులతో గిల్లి కజ్జాలు,
అదే మరపు రాని బాల్యం, మరలి రాని బాల్యం !

ఏడుస్తూ స్కూల్ కి వెళ్ళే రోజులు,
స్కూల్ బంక్ కొట్టడానికి వాన కోసం ఎదురు చూపులు,
సరిగ్గా చదవక టీచర్ దగ్గర బెత్తం దెబ్బలు,
తెల్ల దుస్తులు నల్లగా మారేలా మట్టిలో ఆటలు,
అదే మరపు రాని బాల్యం, మరలి రాని బాల్యం !

Best Childhood Memories Kavithalu-1
Best Childhood Memories Kavithalu (Pic Credits)

ఆనందంగా గడిపే వేసవి సెలవులు,
బావి నీళ్లలో ఈత నేర్చుకోవడాలు,
సైకిల్ నేర్చుకొంటూ కింద పడిపోవడాలు,
దొంగా పోలీస్, కోకో, బిళ్ళంకోడు, గోలీలు అని రకరకాల ఆటలు,
అదే మరపు రాని బాల్యం, మరలి రాని బాల్యం !

చల్లని వెన్నెలలో ఆరుబయట పడుకొన్న రోజులు,
జాతర, తిరునాళ్ళలో సందడి చేసిన రోజులు,
రాళ్ళు విసిరి చింతకాయలు రాలగొట్టిన రోజులు,
అమాయకత్వం, ఆప్యాయత, స్వచ్ఛత కలగలిపిన మధుర జ్ఞాపకాలు,
అదే మరపు రాని బాల్యం, మరలి రాని బాల్యం !!

Best Childhood Memories Kavithalu-2

Best Childhood Memories Kavithalu in English.

Amma cheti gorumuddalu,
Bamma cheppe chandamama kathalu,
Snehithulatho aatapaatalu,
Sodarulatho gilli kajjalu,
Ade marapu rani balyam, marali rani balyam!

Edustoo schoolki velle rojulu,
School bunk kottadaaniki vaana kosam eduruchupulu,
Sarigga chadavaka teacher daggara bettam debbalu,
Tella dustulu nallagaa maarelaa mattilo aatalu,
Ade marapu rani balyam, marali rani balyam!

Aanandangaa gadipe vesavi selavulu,
Bavi neellalo eeta nerchukovadaalu,
Cycle nerchukontoo kinda padipovadaalu,
Donga police, koko, billnkodu, golili ani rakarakaala aatalu,
Ade marapu rani balyam, marali rani balyam!

Challani vennelalo aarubayata padukonna rojulu,
Jaatara, tiranallalo sandadi chesina rojulu,
Rallu visiri chintakaayalu raalagottina rojulu,
Amayakatvam, apyayata, swachata kalagalipina madhura gnapakaalu,
Ade marapu rani balyam, marali rani balyam!
.
.
.
.
Dr. Purushotham…

4 COMMENTS

 1. కమ్మని బాల్యం
  చక్కటి కవిత
  తియ్యటి రాత

  చాలా చాలా బాగుంది సార్!

 2. కమ్మని బాల్యం
  చక్కటి కవిత
  తియ్యటి రాత
  చాలా బాగుంది సార్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here