Random Telugu Quotes in Telugu.
ఆధార్ కార్డు ఆధారంగా,
వేలిముద్రలు ప్రామాణికంగా,
సమయ పాలన లక్ష్యంగా,
ఉద్యోగులు నెత్తిన గుదిబండగా,
కొలువులో బందీలుగా చేసెను…
అదే మన జీ(వి)తాల బయోమెట్రిక్!
పూర్తి రోజు హాజరు ఆకుపచ్చ వర్ణం,
సగం రోజు హాజరు నారింజ వర్ణం,
గైర్హాజరు ఎరుపు వర్ణం,
ప్రజా సెలవు ముదురు నీల వర్ణం,
క్యాజువల్ లీవ్ లేత నీల వర్ణం,
విహారం వంగ రంగు వర్ణం,
మన బతుకులకు రంగులు అద్దెను…
అదే సప్త వర్ణాల బయోమెట్రిక్ !
ఉదయం పూట ఉరుకులు,
సాయంత్రం పూట ఎదురుచూపులు,
ఆలస్యం అయితే జీతం లో కోతలు,
వేలిముద్రలు వేయకపోతే మెమోలు,
నిత్యం దాన్ని గురించే చర్చలు, చివాట్లు…
అదే అదే మన తలరాత ల బయోమెట్రిక్ !!

Random Telugu Quotes in English.
Aadhar card aadharangaa,
Velimudra pramanikangaa,
Samaya paala lakshyangaa,
Udyogulu nittina gudibandagaa,
Kuluvulo bandheelugaa chesenu…
Ade mana Jee(vi)taala Bio-metric !
Purti roju haajaru aakupacha varnam,
Sagam roju haajaru naarinja varnam,
Gairhaajaru yerupu varnam,
Prajaa selavu muduru neelam varnam,
Casual leave letha neelam varnam,
Vihaaram vanga rangu varnam,
Mana bathukulaku rangulu addenu…
Ade saptavarnaala Bio-metric !
Udayam puta urukulu,
Sayantram puta eduruchupulu,
Alasyam ayite jeetamlo kotalu,
Velimudralu veyakapothe memolu,
Nityam danigurinche charchalu, chivaatlu…
Ade Ade mana talaraatala Bio-metric !
.
.
.
.
Dr. Purushotham…
Chala baga rasaru sir…
thank you madam…ee madhya mee kavithalu chusi chala days ayyindhi…meeru raase vidhanam different ga vuntundhi