Home Kavithalu on Life ఎం తెలుసు మీకు? | Telugu Quotes about Reality of Life

ఎం తెలుసు మీకు? | Telugu Quotes about Reality of Life

1
95
Telugu Quotes about Reality
Telugu Quotes about Reality

Telugu Quotes about Reality of Life in Telugu.

నిజాలు లేని అబద్ధాలు ఎన్నో…!
అబద్ధాలలో దాగిన అనర్థాలు ఎన్నో…!
కాలం వెనుక కదిలిన కథలు ఎన్నో…!
ఆ కథలలో దాగిన కల్పితాలు ఎన్నో…!
వెలుతురు లేని వేకువ ఉందా…!
కలలే కనని కళ్ళు ఉన్నాయా…!
చీకటిలో దాగిన అందం విలువ వెలుగులో తెలుసునా…!
వెలుగులో మెరిసిన తారలు నింగిలో కనిపించేనా…!
బాధ లేని బతుకు ఈ లోకంలో ఒక భ్రమ అని తెలుసునా…!
ఎంత వాడు అయిన సరే అమ్మ దగ్గర ఒక అణువు అని తెలుసునా…!
ఈ క్షణం నీకు, మరుక్షణమే గతమని తెలుసునా…!
మన గతమే మన జీవితమని తెలుసునా…!
ఏమి తెలుసు నీకు, నీపై, ఈ లోకం పై…
మాయా లోకం ఇది…
లేనంత వరకు అన్నిటి విలువ తెలిసుకుంటారు.
కొంచెం చేతిలో సొమ్ము ఉంటే చాలు అన్ని విలువలను మరిచిపోతారు.
అప్పుడు బంధాలు బరువు అవుతాయి.
మర్యాదలు మాయం అవుతాయి.
ప్రేమలు అన్ని పాత బడతాయ్.
గర్వం ఇంకా గర్జిస్తుంది.
వీడు మానవుడే,
కానీ మహామాయలు కలిగి, రంగులు మార్చిన ఊసరవెల్లి కూడా…

Telugu Quotes about Reality
Telugu Quotes about Reality

Telugu Quotes about Reality of Life in English.

Nijaalu leni abaddhalu enno.
Abaddhalalo dagina anarthaalu enno.
Kaalam venuka kadilina kathalu enno.
Aa kathalalo daagina kalpitaalu enno.
Veluturu leni vekuva undaa.
Kalale kanani kallu unnayaa.
Cheekatilo daagina andam viluva velugulo telusunaa.
Velugulo merisina taaralu ningilo kanipinchenaa.
Baadha leni batuku ee lokamlo oka bhrama ani telusunaa.
Enta vaadu ayinaa sare amma daggara oka anubu ani telusunaa.
Ee kshanam neeku, marukshaname gatamani teslusunaa.
Mana gatame mana jeevitamani telusunaa.
Emi telusu neeku, Neepai, Ee lokampai.
Maayaa lokam idi.
Lenanta varaku anniti viluva telusukuntaaru.
Konchem chetilo sommu unte chaalu anni valuvalanu marichipotaru.
Appduau bandhaalu baruvu avutayi,
Maryaadalu mayam avutayai,
Premalu anni paatabadatayi,
Veedu maanavude,
Kani mahaamaayalu kaligi, rangulu marchina usaravelli kudaa…
.
.
.
.
Made Santosh…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here