Pelli Roju Subhakankshalu Telipe Kavithalu in Telugu.
Read More Pelli Roju Subhakankshalu Telipe Kavithalu >
జీవితంలో అతి ముఖ్యమైన రోజు ఈ పెళ్లిరోజు,
జీవితం ఒక కొత్త మలుపు తిరిగిన రోజు,
మనసు నిండా మధురమైన ఊహలు,
వాటికి ఒక రూపం వచ్చిన రోజు,
అయినా మనసు భారమై,
తన వాళ్లను విడిచి వెళ్లే రోజు,
ఒక కొత్త ప్రపంచంలోకి అడుగులు వేస్తున్న రోజు,
నిన్నకు రేపుకు మధ్య తేడా తెలుస్తున్న రోజు,
గతించిన రోజులు కాదు గడుస్తున్న రోజులే,
ఒక కొత్త జీవితం అనిపించే రోజు,
కొత్త ఇల్లు, కొత్త మనుషులు,
కొత్త అలవాట్లు, కొత్త బంధాలు అనుబంధాలు,
అంతా కొత్తే అనిపించే రోజు,
అయినా భయం లేదు నాకంటూ ఒక తోడు ఉన్నాడు,
అని ధైర్యం వచ్చే రోజు,
అన్నీ తానై జీవితాంతం,
నాతో కలిసి ఉంటే చాలు అనిపించే రోజు,
అగ్నిసాక్షిగా వివాహమాడి,
ఏడడుగులు నడిచిన రోజు,
అలాంటి ఈ పెళ్లి రోజు నీ జీవితంలో,
ఎనలేని సంతోషం ఆనందం,
నిండి ఉండాలని,
ఇలాంటి పెళ్లి రోజులు,
ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ…
సర్వదా నీ అభ్యున్నతిని ఆకాంక్షించే …
నీ . . . . . . . . . . . . . . . .
Pelli Roju Subhakankshalu Telipe Kavithalu in English.
Jeevithamlo ati mukhuyamaina roju ee Pellirou,
Jeevitam oka kotta malupu tirigina roju,
Manasu nindaa mudhuramaina oohalu,
Vaatiki oka roopam vachina roju.
Ayinaa manasu bharamai,
Tana vallanu vidichi velle roju
Oka kotta prapanchamloki adugulu vestunna roju,
Ninnaku repuku madhya tedaa telustunna roju,
Gatinchina rojulu kaadu gadustunna rojule,
oka kotta jeevitam anipinche roju.
Kotta illu, Kotta manushulu,
Kotta alavaatlu, Kotta bandhaalu anubandhaalu,
Antaa kotte anipinche roju.
Ayinaa bhayam ledu naakantoo oka thodu unnadu,
Ani dhairym vache roju.
Anni taanai jeevitaantam,
Naatho kalisi unte chalu anipinche roju.
Agnisakshigaa vivaahamaadi,
Edadugulu nadichina roju.
Alaanti ee Pelli roju nee jeevitamlo,
Enalani santosham aanandam,
Nindi undaalani,
Ilaanti Pelli rojulu,
Enno jarupukovaalani aashistoo…
Sarvadaa Nee abhyunnatini aakankshinche …
Nee…………..
.
.
.
.
అశోక్ ముడుంబ (Ashok M) (Nizampet)…