Inspirational Telugu Kavithalu in Telugu.
Read More Inspirational Telugu Kavithalu >
ఉషోదయపు కిరణాలు తనువును తాకగా,
నవోదయపు ఆశలు మదిలో చిగురించగా,
వాటి కోసం ఈరోజు ప్రయత్నం ఆరంభించు !
క్షణాలు గడిచే కొద్దీ ఎండ వేధిస్తున్నా,
కష్టాలు గుండెను బాధిస్తున్నా,
మొదలెట్టిన పనిని ఈరోజంతా కొనసాగించు !
సమస్యలు మన మెదడును చుట్టుముట్టినా,
చిగురించిన ఆశలన్నీ ఆవిరవుతున్నా,
ఈరోజు గెలుపు కోసమే శ్రమించు !
నిన్నటి తప్పులను సరిదిద్దుకొంటూ,
రేపటి లక్ష్యం కోసం పోరాడుతూ,
చేరే గమ్యానికి ఈరోజు బాటలు పరుచు !
నింగిలో చీకట్లు కమ్ముకొంటున్నా,
చల్లని వెన్నెలలో చేసిన శ్రమను తలచుకొంటూ,
రాబోయే విజయాన్ని ఈరోజు ఆస్వాదించు !
Inspirational Telugu Kavithalu in English.
Ushodayapu kiranalu thanuvunu thakaga,
Navodayapu aasalu madhilo chigurinchaga,
Vaati kosam eeroju prayathnam aarambhinchu !
Kshanalu gadiche koddhi enda vedisthunna,
Kastalu gundenu badisthunna,
Modhalettina panini eeroju antha konasaginchu !
Samsyalu mana medadunu chuttumuttina,
Chigurinchina aasalanni aaviravuthunna,
Eeroju gelupu kosame sraminchu !
Ninnati thappulu sarididdhukontu,
Repati lakshyam kosam poraduthu,
Chere gamyaniki eeroju baatalu paruchu !
Ningilo cheekatlu kammukontunna,
Challani vennelalo chesina sramanu thalachukontu,
Raaboye vijayanni eeroju aaswadhinchu !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…