Home KAVITALU IN ENGLISH విందు భోజనం | Kavithalu on Vindu Bhojanam – Appudu – Ippudu

విందు భోజనం | Kavithalu on Vindu Bhojanam – Appudu – Ippudu

0
331

 Kavithalu on Vindu Bhojanam – Appudu – Ippudu in Telugu.

 

పూర్వం మన చేతిలో విస్తరాకు కంచం,
ఇప్పుడు మన చేతిలో ప్లాస్టిక్ అట్ట కంచం !

అప్పుడు పంక్తిలో కూర్చుని భోజనం,
ఇప్పుడు పంక్తిలో నిలబడి చెయ్యి చాపడం !

ఆప్యాయంగా వడ్డించే సహ పంక్తి భోజనం,
ఆస్తులు అన్ని రాసిస్తున్నట్టు వడ్డించే బఫే భోజనం !

పంక్తిలో జనం అంతా ఒకే సారి ముగిస్తారు భోజనం,
బఫె లో జనం విడి విడిగా ముగిస్తారు భోజనం !

విస్తరాకు భోజనాలలో మిత్రులతో కాలక్షేపం,
బఫే భోజనాలలో  అట్ట కంచం జారి పోవును అని భయం !

పంక్తి భోజనాలలో కాన వచ్చే అనురాగ బంధం,
బఫె భోజనాలలో కాన రాని అనురాగ బంధం !

పంక్తి భోజనాలు మన ప్రాచీన సాంప్రదాయం,
బఫే భోజనాలు మన  సాంప్రదాయాలకు పట్టిన పైత్యం !

Kavithalu on Vindu Bhojanam – Appudu – Ippudu in English.

Purvam mana chethilo vistharaku kancham,
Ippudu mana chethilo plastic atta kancham !

Appudu pankthi lo kurchoni bhojanam,
Ippudu pankthi lo nilabadi cheyyi chapadam !

Aapyamga vaddinche sahapankthi bhojanam,
Aasthulu Anni raasisthunnattu vaddinche bafe bhojanam !

Pankthi lo janam antha okesari mugistharu bhojanam,
Bafe lo janam vidi vidiga mugistharu bhojanam !

Vistharaku bhojanalalo mithrulatho kalaskhepam,
Bafe bhojanalalo atta kancham jaaripovunu ani bhayam !

Pankthi bhojanalalo kaana vacche anuraaga bhandham,
Bafe bhojanalalo kaana raani anuraaga bhandham !

Pankthi bhojanalu mana pracheena sampradayam,
Bafe bhojanalu mana sampradayaniki pattina paithyam !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here