Sri Rama Navami Subhakankshalu Kavithalu in Telugu.
Read More Sri Rama Navami Subhakankshalu Kavithalu >
మన జీవితంలో ఏమి అయినా అన్యాయాన్ని చూస్తే అయ్యో రామా అంటాం,
ఏమి అయినా చెడు వింటే రామ రామా అంటాం,
ఆకలితో అలమటించే పేద వారు అన్నమో రామ చంద్ర అంటారు,
ఎవడైనా చక్కగా పరిపాలిస్తే రామ రాజ్యం అంటాం,
అన్ని మంచి పనులు చేసే వాడిని రాముడు మంచి బాలుడు అంటాం,
ఏక పత్ని వ్రతుడు అంటే రాముడ్ని తలుస్తాం,
పితృ వాక్య పరిపాలకుడు అంటే రాముడ్ని గుర్తు చేసుకొంటాం,
ఒకే మాట ఒకే బాణం అని రాముడి గురించి చెప్పుకొంటాం..!!
మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన శబ్దం రామ నామం,
మన పెదవుల్లో పుట్టుకు వచ్చే తారక మంత్రం రామ గానం,
మన మదిలో కొలువైన దివ్య రూపం రామావతారం,
మన ప్రవర్తనను నిర్దేశించే దివ్య గ్రంథం రామాయణం,
మన జీవితాల్లో విజయ రహస్యం రామ మంత్రం,
మన యద లో వెలిగే భక్తి జ్యోతి రామ చరితం !!
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…