Sri Rama Navami Kavithalu in Telugu.
Read More Sri Rama Navami Kavithalu >
లోక సంరక్షణార్థం అవనిపై జనించి,
సీతాన్వేషణకై రాక్షస సంహారం కావించి,
పితృవాక్య పరిపాలకుడిగా పేరొంది,
సోదర బంధానికి ప్రతీకగా నిలచి,
ఆలుమగల అనురాగానికి చిహ్నమై,
అంజనీ సుతుని ఆరాధ్య దైవమై,
రామదాసుని కటాక్షించి,
భద్రగిరిపై సీతాసమేతుడై,
భక్తజనులకు పావనమూర్తియై,
లోకాభిరాముడిగా మన్ననలొందెను.
పరమప్రీతి పాత్రుడిగా ఇలలో నిలిచెను.
లోకానికే ఆదర్శమాయెను ఆయన దివ్యచరితం.
నవమి నాడు శ్రీరాముని కల్యాణం,
కనులారా గాంచిన వారి జన్మ ధన్యం..
శ్రీరామనామం సర్వపుణ్యధామం,
తరతరాలకు చెరగని సంకేతం..
.
.
.
.
N.Venkatalakshmi ( Yemmiganur )…