Independence day kavithalu in Telugu.
ఎగురుతున్నది ఎగురుతున్నది దేశ కీర్తి విహంగం
రెప రెపలాడుతున్నది రెప రెపలాడుతున్నది మువ్వన్నెల పతాకం
వినబడుచున్నది వినబడుచున్నది జాతి సమైక్యతా రాగం !
ఏ ప్రాంతమైనా ఏ మతమైనా నీకు చేసెదరు వందనం
అహింస మన ఆయుధం అని గుర్తు చేయును నీ రూపం
నిన్ను చూడగానే దేశభక్తితో ఉప్పొంగును హృదయం !
స్వలాభం విడిచి కర్తవ్యంకి అంకితం అవ్వాలని తెలుపును కాషాయం
మన ప్రవర్తనను నిర్దేశించే వెలుగుకు సత్యానికి చిహ్నం శ్వేత వర్ణం
మట్టితో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేయును హరిత వర్ణం !
ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ పతాకం
బానిస బతుకులకు చరమ గీతం ఈ పతాకం
స్వేచ్ఛా స్వతంత్రాలకు ఆరంభం ఈ పతాకం !
సోమరితనం వదిలి ముందుకు సాగుదాం
అహర్నిశలు శక్తి వంచన లేకుండా శ్రమిద్దాం
దేశాభివృద్ధికి మన వంతు సహకారం అందించుదాం !
జైహింద్ ….
Eguruthunnadhi eguruthunnadhi desa Keerthi vihangam
Repa repaladuthunnadhi repa repaladuthunnadhi muvvannela pathakam
Vinabaduchunnadhi vinabaduchunnadhi jaathi samaikytha raagam !
Ee pranthamaina,ee mathamaina neeku chesedharu vandhanam
Ahimsa mana ayudham ani gurthu cheyunu nee rupam
Ninnu chudagane desabakthi tho uppongunu hrudayam !
Swalabham vidichi karthvyam ki ankitham avvlani thelupunu kashayam
Mana pravarthananu nirdeshinche velugu ki sathyaniki chihnam Swetha varnam !
Mattitho manakunna anubandhanni gurthu cheyunu Haritha varnam !
Endharo mahanubhavula thyaga palam ee pathakam
Bhanisa bathukulaku charama geetham ee pathakam
Sweccha swathanthralaku aarambham ee pathakam !
Somarithanam vadili mundhuku saagudham
Aharnisalu sakthiki vanchana lekunda sramiddham
Desabhivruddhi ki mana vanthu sahakaram andhinchudham !
Jai Hind ….
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…