Home Corona_Quotes వైద్య సిబ్బందికి వందనం | Doctor Quotes Telugu

వైద్య సిబ్బందికి వందనం | Doctor Quotes Telugu

0
635

Doctor Quotes Telugu in Telugu Text.

అన్ని ఆలయాలు మూత పడిన వేళ

అన్ని వ్యవస్థలు స్తంభించిన వేళ
అన్ని దేశాలు స్వీయ నిర్బంధం లోకి వెళ్లిన వేళ
అందరు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న వేళ
మేమున్నాం అని ముందుకు కదిలిన వైద్య సిబ్బందికి వందనం
జనుల ప్రాణాల కోసం పోరాడుతున్న యోధులకు అభివందనం !
రక్షణ కవచాలతో దేహం ఇబ్బంది పడుతున్నా
మాస్కులతో ఊపిరి పీల్చడం కష్టం గా ఉన్నా
శానిటైజర్ల తో చేతి చర్మం పొడిబారుతున్నా
విధి నిర్వహణలో ఎదురు దెబ్బలు తగులుతున్నా
మేమున్నాం అని ముందుకు కదిలిన వైద్య సిబ్బందికి వందనం
జనుల ప్రాణాల కోసం పోరాడుతున్న యోధులకు అభివందనం !
నిద్రాహారాలు మాని నిరంతరం రోగుల సేవలో తరిస్తూ
కుటుంబాలను త్యజించి క్వారంటైన్ సెంటర్ లలో గడుపుతూ
ప్రాణాలను పణం గా పెట్టి కనిపించని జీవి తో యుద్ధం చేస్తూ
నిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు స్ఫూర్తిని నింపుతూ
మేమున్నాం అని ముందుకు కదిలిన వైద్య సిబ్బందికి వందనం
జనుల ప్రాణాల కోసం పోరాడుతున్న యోధులకు అభివందనం !

Doctor Quotes Telugu in English.

Anni aalayalu mutha padina vela
Anni vyavasthalu sthambhinchina vela
Anni desalu sweeya nirbhandam lo ki vellina vela
Andharu corona rakkasi korallo chikkukunna vela
Memunnam ani mundhuku kadhilina vaidhya sibbandhi ki vandhanam
Janula pranala kosam poraduthunna yodhulaki Abhi vandhanam !
Rakshana kavachalatho deham ibbandhi paduthunna
Maskulatho vupiri peelchadam kastam ga vunna
Sanitizerlatho chethi charmam podi baruthunna
Vidhi nirvahanalo edhuru debbalu thaguluthunna
Memunnam ani mundhuku kadhilina vaidhya sibbandhi ki vandhanam
Janula pranala kosam poraduthunna yodhulaki Abhi vandhanam !
Nidraharalu maani nirantharam rogula sevalo tharisthu
Kutumbhalanu thyajinchi quarentine centre lo gaduputhu
Pranalanu panam ga petti kanipinchani jeevitho yuddam chesthu
Nithyam prajala jeevithalalo velugunu,spurthini nimputhu
Memunnam ani mundhuku kadhilina vaidhya sibbandhi ki vandhanam
Janula pranala kosam poraduthunna yodhulaki Abhi vandhanam !
.
.
.
.
Dr. Purushotham ( Chittor )…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here