Telugu Birthday Quotes for Wife in Telugu text
గుండెను కవితగ మార్చి చెప్పనా
నా బంగారు ఇంటి దీపం నా శ్రీమతి జన్మదినాన
నాకోసం కార్చే నీ స్వేదం ముందు చినబోదా నా బహుమతి
నా స్వప్నం, నా విజయం నీ యందు నాకు దేవుడిచ్చిన పురోగతి
దేవుడిచ్చిన బహుమతితో కలిసి కేరింతలు కొట్టే క్షణాన
నేను తెచ్చిన బహుమతితో నగుమోముకై యత్నించే సమయాన
రాకూడదా ఈ రోజు మరో రోజున?!!
భరించే వాడిని నేనైనా నన్ను భరించింది నువ్వు
ఎన్నో భరించి అన్నీ తన మాటున చేర్చిన నీ చిరునవ్వు
ఊహించని క్షణములో అందించిన నీ చేయి
ఊహకైనా అందని భావం నీవోయి
కష్టమొచ్చినా నష్టమొచ్చినా నాకూ సగమన్నావు
ఎందుకు అని అడిగితే నేను నీలో సగమన్నావు
అగమ్యగోచర తరుణంలో ఆలోచనవయ్యావు
దేవుడిచ్చిన జీవిత నావలో చుక్కానివయ్యావు
శ్రీమతీ! అందుకోవా? ఈ నా చిరు బహుమతి
Telugu Birthday Quotes for Wife in English text
Gundenu kavitaga maarchi cheppanaa
Naa bangaaru inti deepam naa shreemati janmadinaana
Naakosam kaarche nee swedam mundu chinabodaa nee bahumati
Naa swapnam, naa vijayam nee yandu naaku devudichchina purogati
Devudichchina bahumaatitho kalisi kerintalu kottina kshanaana
Nenu techchina bahumatitho nagumomukai yatninche samayaanaa
Raakoodadaa ee roju maro rojuna !!
Bharinche vaadini nenainaa nannu bharinchindi nuvvu
Enno bharinchi anni tana maatuna cherchina nee chirunavvu
Oohinchani kshanamulo andinchina nee cheyi
OOhakainaa andani bhaavam neevoyi
Kashtamochchinaa nashtamochchinaa naakoo sagamannaavu
Enduku ani adigithe nenu neelo sagamanaavu
Agamyagochara tarunamlo aalochanavayyaavu
Devudichchina jeevita naavalo chukkaanivayyaavu
Shreemati ! Andukovaa ee naa chiru bahumati ….
.
.
.
.
.
Manohar (కొడమల మనోహర్)