Humanity Quotes Telugu With Images
ఎక్కడ అందరు ఒక్కటై
హద్దులు ఎరుగని ప్రేమతో
చెదరని స్వచ్ఛటి మనసుతో
ఐక్యత నిండిన భావంతో
సమతామమతల విలువలతో
కులమతాలను… కూలద్రోలి
ధనదాహాన్ని… పారద్రోలి
ద్వేషాలను… తరిమి కొట్టి
స్వార్థాలను… పాతిపెట్టి
అసూయలను… అంతంచేసి
పరుల కష్టానికి చలించి
నీ స్నేహ హస్తాన్ని అందించి
పనిలో దైవాన్ని నీవెంచి
పలువురికి మార్గాన్ని సూచించి
క్షమాగుణాన్ని అనుసరించి
భేదం లేని పంచ భూతాల్లా
స్వార్థంలేని సూర్య చంద్రుల్లా
వివక్షత లేని ప్రకృతిలా
విలువైన ఆశయాలతో
నిత్యనూతనమౌతారో…….
అక్కడ…అక్కడ …అక్కడ
మానవత్వం… వికసిస్తుంది
మంచితనం… పరిమళిస్తుంది
మనిషిమనుగడ… ఉజ్వలిస్తుంది
అపురూపం… సార్థకమౌతుంది
ఈ విశ్వం…….
శాంతి సుందర మౌతుంది
సర్వేజనా సుఖినోభవంతు….
Humanity Quotes Telugu In English
Ekkada andaru okkatai
Haddulu Erugani prematho
Chedarani swechchati manasutho
Ikyata nindina bhaavamtho
Samathaa mamathala viluvalatho
Kulamathaalanu… kooladroli
Dhanadaahaanni… paaradroli
Dweshaalanu… tarimikotti
Swaarthaalanu… paatipetti
Asooyalanu… antamchesi
Parula kashtaaniki chalinchi
Nee sneha hastaanni andinchi
Panilo daivanni neevenchi
Paluvuriki maargaanni soochinchi
Kshamaagunaanni anusarinchi
Bhedam leni pancha bhootaallaa
Swartham leni surya chandrullaa
Vivakshata leni prakruti laa
Viluvaina aashayaalatho
Nitya nootanamoutaaro ….
Akkada. Akkada.. Akkada…
Maanavatvam… vikasistundi
Manchitanam… parimalistundi
Manishi manugada… ujwalistundi
Apuroopam… saarthakamoutundi
Ee Viswam …
Shanti sundaramoutundi
Sarvejanaa sukhinobhavantu ….
.
.
.
.
Tulasi Uppara (Anantapur)
తులసీ గారూ! మీ కవితలు చాలా బాగున్నాయి.
అద్భుతం మీ మనసు చాలా అద్భుతం
మీ కవిత చాలా అద్భుతం ❤️❤️❤️