Home TELUGU KAVITALU ప్రపంచ పర్యావరణ దినోత్సవం . . . . . !

ప్రపంచ పర్యావరణ దినోత్సవం . . . . . !

1
616

¤ ఆటలు ఆడిన ప్రకృతి ఒడిని అంగిట బొమ్మగ మార్చావు . . ,

తను పంచిన ప్రేమను మరిచావు . . . !

అజ్ఞానంతో అభివృధ్ధంటూ అందాలన్నీ చెరిచావు . . ,

రాక్షసుడిగ నివు మారావు . . . !

ఏమడిగిందని ప్రకృతి నిన్ను యద గాయంగా మార్చావు . . ,


అంతెరగని ఈ ధన దాహంతో రాగల రోజులు మరిచావు . . . !

నువు తెలిసీ తెలియక చేసిన తప్పుకు . . . . ,

చల్లగ వీచే గాలులు లేక . ,

సేద తీరుటకు నీడే లేక . ,

తాగ గుక్కెడు నీళ్ళే లేక . ,

దీనంగా నివు చూసే నాటికి . . . ,

వికృత ఆకృతి దాల్చిన ప్రకృతి . . ,

విష వలయంగా మారునురా . . ,

విలయాకారం దాల్చునురా . . .

అంతా తెలిసి లోకం మరిచి . . ,

మొద్దు నిద్రలో మునగకురా . . ,

ముప్పుతో ముచ్చటలాడకురా . . !

పంతం పట్టి చెడపకురా . . ,

పసి పాపే ప్రకృతి మరువకురా . . . ?

.

.

.

.

రామ్ ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here